AP News: అధికారం ఉందని బరితెగిస్తే బడితెపూజ ఖాయం: అచ్చెన్నాయుడు

వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు..

Published : 30 Nov 2021 12:04 IST

అమరావతి: వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ప్రజలు, విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు.. దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి శూన్యమని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే.. వైకాపా కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో తెదేపాకు చెందిన మహిళా సర్పంచ్‌ మల్లేశ్వరి ఇంటిపై వైకాపా రౌడీ మూకలు దాడి చేశారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహిళా హోంమంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితేంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారం ఉందని బరితెగించి వ్యవహరిస్తున్న వారికి రానున్న రోజుల్లో మహిళల చేతిలోనే బడితెపూజ ఖాయమని హెచ్చరించారు. వైకాపాకు కౌంట్‌డౌన్‌ మొదలైందని.. ఇక వారి అరాచకాలు సాగవన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెదేపా ప్రభుత్వమేనన్నారు. మల్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని, కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని