AP News: ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపు.. రేపట్నుంచి ఉద్యోగుల విధుల బహిష్కరణ 

విజయవాడలోని ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు.

Updated : 30 Nov 2021 16:10 IST

అమరావతి: విజయవాడలోని ఎన్టీఆర్‌ వర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఐకాసగా ఏర్పడ్డాయి. అంతకుముందు ఉద్యోగులు సమావేశమై చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం వర్సిటీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. వర్సిటీ నిధులను కాపాడతామంటూ వీసీ, రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు.

అనంతరం ఐకాస కన్వీనర్‌ వెంకటనారాయణ మీడియాతో మాట్లాడుతూ వర్సిటీ నిధుల మళ్లింపుపై ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పారు. వర్సిటీ పరిణామాలపై గవర్నర్‌కు నివేదిస్తామన్నారు. సీఎంవో ఒత్తిడితో వర్సిటీ నిధులు మళ్లిస్తున్నారని ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అప్పులు పుట్టక సంస్థల నిధులు మళ్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీని, ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని