logo
Published : 01/12/2021 05:44 IST

నేడు రాష్ట్రానికినీతి ఆయోగ్‌ బృందం

వీరపనేనిగూడెం(గన్నవరం గ్రామీణం), విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రెండు రోజుల పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డా.రాజీవ్‌ కుమార్‌ బృందం బుధవారం రాష్ట్రానికి రానుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించే నిమిత్తం ఉదయం దిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం, వీరపనేనిగూడెం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ జె.నివాస్‌.. జేసీ మాధవీలత, శివశంకర్‌తో కలిసి మంగళవారం సమీక్షించారు. రాజీవ్‌ కుమార్‌ సందర్శించే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, క్షేత్రస్థాయి పంటల పరిశీలన, రైతులు, పొదుపు సంఘాలతో కలెక్టర్‌ సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సచివాలయ, ఆర్‌బీకే ఇతర సేవలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో సుభాషిణి, తహసీల్దార్‌ నరసింహారావు, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు, డీటీ శ్రీనివాసరావు, ఈవో నామేశ్వరరావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని