logo
Updated : 01/12/2021 06:33 IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రమాద స్థలంలో నలుగురు కింద పడి ఉన్న దృశ్యం

మేడికొండూరు, న్యూస్‌టుడే: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని విశదల అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్తెనపల్లికి చెందిన పఠాన్‌ బాజీఖాన్‌ (40) గుంటూరులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పని చేస్తున్నారు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. విశదల అడ్డరోడ్డు సమీపంలో పేరేచర్లలోని క్రషర్‌లో లారీ డ్రైవర్లుగా పని చేస్తున్న ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన గొర్రెపాటి నాగేంద్రబాబు (35), భూషయ్య, కట్టావారిపాలెంకు చెందిన నాగమల్లేశ్వరరావు మేడికొండూరు మీదుగా పేరేచర్ల వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురూ కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులు క్షతగాత్రులను ఆటోలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. పరీక్షించిన వైద్యులు పఠాన్‌ బాజీఖాన్‌, నాగేంద్రబాబు మృతి చెందారని నిర్ధారించారు. భూషయ్య, నాగమల్లేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని