logo
Published : 01/12/2021 05:44 IST

భూ పరిహారం చెల్లించాలని వినతి


రైతులతో మాట్లాడుతున్న జేసీ కార్యాలయ అధికారులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడ-ఖమ్మం మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు (హైవే) నిర్మాణానికి అధికారులు భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. విజయవాడ గ్రామీణ మండలం పైడూరుపాడు గ్రామ పరిధిలో 21 రైతు కుటుంబాలు తమ జీవనాధార భూములను కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎకరాకు రూ.11.60 లక్షలు మాత్రమే వస్తుంది. దీనికి సరిహద్దులోని జక్కంపూడిలో రూ.72 లక్షల ధర ఉంది. ఇదే ధరను తమకు వర్తింప చేయాలని కోరుతూ పలువురు రైతులు మంగళవారం నగరంలోని జేసీ (రెవెన్యూ) విడిది కార్యాలయానికి వచ్చారు. జేసీ కె.మాధవీలత క్షేత్ర స్థాయి పర్యటనలో ఉండటంతో కార్యాలయ అధికారులకు తమ సమస్యలు తెలియజేశారు. హైవే ఏర్పాటు వల్ల పొలాలకు రాకపోకలు వీలుగా బైపాస్‌, సర్వీసు రోడ్లు వేయాలని, అండర్‌ పాస్‌ వంతెన నిర్మించాలని జక్కంపూడి, పైడూరుపాడు గ్రామాల రైతులు కోరారు. పైడూరుపాడు సర్పంచి వేముల సీతారామయ్య, రైతులు రంగినేని సాంబశివరావు, నాగేశ్వరరావు, షాబాదకు చెందిన లకింశెట్టి బాబు, కవులూరుకు చెందిన బోగినేని రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని