logo
Published : 01/12/2021 06:11 IST

మీటర్‌ రీడర్ల సమస్యల పరిష్కారానికి కృషి


నిరసనకారులకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు

విజయవాడ (అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : రాష్ట్రంలోని మీటర్‌ రీడర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రభుత్వం వినని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. విజయవాడ ధర్నాచౌక్‌లో ఏపీ విద్యుత్తు మీటర్‌ రీడర్ల ధర్నా మంగళవారం రెండో రోజు కొనసాగింది. వీరికి ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పని దినాల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, 15శాతం సర్వీసులను రీడింగ్‌ డిపార్టుమెంట్‌ ఉద్యోగులతో చేయించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. పీస్‌ రేటు రద్దు చేసి, మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీ విద్యుత్తు మీటర్‌ రీడర్లు రాష్ట్ర కార్యాచరణ కమిటీ సభ్యులు బాలకాశి, పి.బ్రాహ్మజీ రావు, బి.రాజు, మహీంద్ర, గఫూర్‌, పి.శ్రీనివాసులు, జాకబ్‌, ఈశ్వరరావు, ఆనంద్‌, బ్రహ్మం, మూస, తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని