logo
Updated : 01/12/2021 06:30 IST

మద్యం పట్టివేత

నుమాన్‌జంక్షన్‌ సరిహద్దులోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అందులో పనిచేసే ఉద్యోగి, మరొక వ్యక్తి కలిసి అక్రమంగా మద్యం తరలిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు ఈ కేసు వివరాలను  విలేకర్లకు తెలిపారు. హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మొవ్వా ప్రసాద్‌, పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడుకు చెందిన మద్దాల రమేష్‌ సోమవారం సాయంత్రం కారులో వెళుతుండగా.. హనుమాన్‌జంక్షన్‌ కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల్ని తప్పించుకుని పోయేందుకు ప్రయత్నించగా, అనుమానం వచ్చి కారును తనిఖీ చేశారు. ఇందులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు.

- న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్‌

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని