logo
Published : 01/12/2021 06:11 IST

అనారోగ్యంతో బలవన్మరణం

సుబ్బారావు (పాత చిత్రం)

గొల్లపూడి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతూ కంతేటి సుబ్బారావు(58) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. అపార్టుమెంటు పైన ఉండే వాటర్‌ ట్యాంకు పిల్లర్‌కు ఉరివేసుకుని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. గొల్లపూడి వన్‌సెంటర్‌రోడ్డులోని అపార్టుమెంటులో నివాసం ఉండే సుబ్బారావు లారీ డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత పదేళ్లుగా సుబ్బారావు చర్మ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 26వ తేదీన అతని పెద్ద కుమారుడు ఇంటికి వచ్చిన సమయంలో తనకు రోగాలు తగ్గవని చనిపోతానంటూ బాధపడ్డారు. ఈ నెల 29వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసి పడుకున్నారు. మంగళవారం ఉదయం 6.30గంటలకు వాచ్‌మెన్‌.. సుబ్బారావు మృతదేహం అపార్టుమెంటు ప్రహరీగోడ పక్కన పడిఉండటాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. శరీరం నుంచి తల విడిపోయి ఉండటం చూసి భవానీపురం పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు.

తొలుత హత్యగా ప్రచారం... : శరీరం ఒక చోట, తల మరోచోట విడిపోయి ఉండటంతో మొదట హత్యగా భావించారు. మృతదేహం పడిఉన్న తీరు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, క్లూస్‌ విభాగం విచారణ చేపట్టింది. అపార్టుమెంటుపైన నైలాన్‌ తాడు కట్టి ఉండటం, చెప్పులు కనిపించటం, పిట్టగోడపై కాలి వేలిముద్రలు ఉండటం చూసి భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని