logo
Published : 01/12/2021 06:11 IST

విద్యార్థులకు రూ.67.31 కోట్లు జమ


చెక్కు విడుదల చేస్తున్న ఎమ్మెల్యేలు జోగి, కొక్కిలిగడ్డ, దూలం, మల్లాది, మేయర్‌ భాగ్యలక్ష్మి, కలెక్టర్‌ నివాస్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా మూడో విడత ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కింద మంగళవారం జిల్లాలో 93,951 మంది విద్యార్థులకు రూ.67.31 కోట్లు జమ చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా ప్రారంభించారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నగరంలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొదటి విడతలో 92,265 మంది విద్యార్థులకు రూ.66.48 కోట్లు, రెండో విడతలో 93,189 మందికి రూ.68.14 కోట్లు, మూడో విడతతో కలిపి మొత్తం రూ.201.10 కోట్ల మేర జమ అయినట్టు వివరించారు.  ఆయా కళాశాలల్లో విద్యాభ్యాసం, వసతులు సరిగా లేకుంటే.. 1092 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మధ్య, పెడన, తిరువూరు, కైకలూరు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, కొక్కిలిగడ్డ రక్షణనిధి, దూలం నాగేశ్వరరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కాపు, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ల ఛైర్మన్లు అడపా శేషు, శ్రీకాంత్‌, జేసీ కె.మోహన్‌కుమార్‌, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల డీడీలు సరస్వతి, లక్ష్మీదుర్గ పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని