logo
Published : 02/12/2021 05:03 IST

ఈఎస్‌ఐ ఆస్పత్రికి మోక్షం

200 పడకలతో నిర్మాణానికి అనుమతి

తొలుత తాత్కాలిక భవనం

గుణదల, న్యూస్‌టుడే


ప్రస్తుతం ఉన్న ఈఎస్‌ఐ ఆస్పతి భవనం..

గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రి శిథిఫలావస్థకు చేరడంతో కొన్ని నెలల నుంచి సేవలు అందడం లేదు. గతంలో ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐటీ నిపుణులు ఈఎస్‌ఐ ఆస్పత్రి భవన సామర్ధ్యాన్ని పరిశీలించి, ఇది పనికిరాదని, నూతన భవనం నిర్మించాలని సూచించారు. అప్పటినుంచి ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. ఇటీవలే ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ దాదాపు 200 పడకలతో ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ముందుగా 40 పడకలతో తాత్కాలిక భవనం కట్టి, ఆ తర్వాత అసలు ఆస్పత్రి పనులు ప్రారంభించనున్నారు.


60 ఏళ్ల ప్రస్థానం


పెచ్చులూడిన శ్లాబ్‌

గుణదలలో 25 ఎకరాల విస్తీర్ణంలో 1961లో 110 పడకలతో కార్మిక ప్రభుత్వం బీమా వైద్యశాల భవనాన్ని నిర్మించారు. 60 ఏళ్లు అవడంతో ఈ భవనం శిథిలావస్థకు చేరింది. ఈ ఆస్పత్రి మూడు జిల్లాల నుంచి 5 లక్షల కార్మికులకు వైద్యసేవలు అందించింది. ఆస్పత్రి అందుబాటులో ఉన్న సమయంలో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉన్న సమయంలో అన్ని రకాల రోగాలకు ఇక్కడే చికిత్స అందించేవారు. ప్రస్తుతం సేవలు నిలిపివేయడంతో రోగులందరినీ ప్రైవేట్‌ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొన్ని ఆస్పత్రులు ఈఎస్‌ఐ నుంచి వచ్చే వారికి అరకొర వైద్యం అందిస్తుండగా, మరికొన్ని చోట్ల కరోనా టెస్ట్‌లు, పీపీఈ కిట్లు పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు.


మొదటి వారంలో...

ప్రస్తుత ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని అద్దె భవనం తీసుకుని తరలించాలని మొదట భావించారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ అధికారులు మాత్రం తాత్కాలిక భవనం కడితే బావుంటుందని పచ్చజెండా ఊపారు. ఆస్పత్రి ప్రాంగణంలో 40 పడకల సామర్ధ్యంతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చినట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారంలో పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. సుమారు నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. తర్వాత శిథిఫలావస్థకు చేరిన పాత ఆస్పత్రి కూల్చే పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి రావాలంటే కార్పొరేషన్‌ కార్యాలయం పక్కన నుంచి రావాలి. భవనం కూల్చివేత పనులు చేపడితే ఇదే దారిలో లారీలు ఎక్కువగా తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆస్పత్రికి రెండో డివిజన్‌ శానిటరీ కార్యాలయం పక్క నుంచి ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేయమని ఉన్నతాధికారులు సూచించారు.


త్వరలో పనులు ప్రారంభం

రాజమహేంద్రవరం తరహాలో ఇక్కడ కూడా సుమారు 40 పడకలతో తాత్కాలిక భవనాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ నిర్మించనుంది. ఉన్నతాధికారులు నుంచి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. వచ్చే నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

- బి.వెంకట రమణమూర్తి, సూపరింటెండెంట్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని