
తిమోతి కుమార్
భవానీపురం, న్యూస్టుడే: కృష్ణా నదిలో భవానీఘాట్ వద్ద వై.తిమోతి కుమార్(19) గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వించిపేట రెల్లివీధిలో నివాసం ఉండే అతడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి భవానీఘాట్ వద్దకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు. నదిలో కొంత దూరం వెళ్లిన తర్వాత కనిపించలేదు. అతడి కోసం స్నేహితులు వేచి చూసినా రాలేదు. దీనితో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వగా బుధవారం నాడు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో నదిలో వెతికినా ఆచూకీ తెలియలేదు. తల్లి పోలమ్మ ఫిర్యాదు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.