logo
Published : 02/12/2021 05:03 IST

స్పిన్నింగు మిల్లులో అగ్ని ప్రమాదం


మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: రేమల్లెలోని మోహన్‌ స్పింటెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఏడు గంటల సమయంలో పరిశ్రమ ఆవరణలోని గోడౌన్లలో మంటలు చెలరేగి, క్షణాల వ్యవధిలోనే వ్యాపించాయి. మొత్తం మూడు గోడౌన్లలో మంటల ధాటికి పత్తి బేళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో మూడు గోడౌన్లలోని బేళ్లు, మొత్తం ఆరింట్లో ఉన్న యంత్ర సామగ్రిని అగ్నికి ఆహుతి కాకుండా అగ్నిమాపక దళాలు కాపాడాయి. హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం, నూజివీడు, మైలవరం, విజయవాడ, ఆటోనగర్‌ ప్రాంతాలకు చెందిన ఏడు అగ్నిమాపక శకటాలు ఉదయం నుంచి రాత్రి వరకు మంటలు వ్యాపించకుండా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. మంటలు చెలరేగడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని హనుమాన్‌జంక్షన్‌ ఇన్‌ఛార్జి అగ్నిమాపకాధికారి జె.ఆంజనేయులు తెలిపారు. నష్టం విలువ రూ.కోట్లలోనే ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. ప్రాంతీయ, జిల్లా అగ్నిమాపకాధికారులు జి.శ్రీనివాసులు, ఐ.ధర్మారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని