logo
Published : 02/12/2021 06:05 IST

బడికి వచ్చినా.. అమ్మఒడి అందేనా?

గ్రామీణ పామర్రు, న్యూస్‌టుడే


ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు

అమ్మఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పథకానికి అర్హత సాధించాలంటే హాజరు తప్పనిసరి చేసింది. అయితే విద్యార్థులు క్రమం తప్పకుండా బడికెళ్తున్నా కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యల కారణంగా హాజరు ఆన్‌లైన్లో నమోదు కావడం లేదు. దీంతో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో విడుదలయ్యే అమ్మఒడి నగదు ప్రోత్సాహానికి వారు అర్హత సాధించడం ప్రశ్నార్థకంగా ఉంది.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ నవంబరు 8న జీవోఎంఎస్‌ నంబరు 73 జారీ చేసింది. అందులో మార్గదర్శకాలను సూచించారు. ఈ ఏడాది నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు 130 పని దినాల్లోని 98 రోజులు బడికి హాజరైన వారికే అమ్మఒడి పథకం అందుతుందని అందులో స్పష్టం చేసింది.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 4,532

విద్యార్థులు 6,05,710

అమ్మఒడి పథకం అందే మొత్తం రూ.15 వేలు

గతేడాది లబ్ధి 3,76,003 మంది తల్లుల ఖాతాలో నగదు జమ

యాప్‌లో హాజరు

విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్‌ విధానాన్ని విద్యాశాఖ ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాను ఎంపిక చేసింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. ఛైల్డ్‌ ఇన్‌ఫోతో అనుసంధానమైన బయోమెట్రిక్‌ ద్వారా హాజరు వేయాల్సి ఉంది. ఈ విధానంలో కొందరు విద్యార్థుల వేలిముద్రలు పడటం లేదు. దీంతో రిజిస్టర్‌లో హాజరు వేసి, అనంతరం స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌లో యూడైస్‌ కోడ్‌ ద్వారా మొదటి పిరియడ్‌లో ఉపాధ్యాయులు నమోదు చేస్తున్నారు. దాదాపు 50 శాతానికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఈ విధానాన్ని అనుసరించడంలేదు. ఇలానే కొనసాగితే ఆయా పాఠశాలల విద్యార్థులు అమ్మఒడికి దూరమయ్యే పరిస్థితి ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దాదాపు 85 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ విధానంలో విద్యార్థుల హాజరు నమోదవుతోంది. వివిధ కారణాలతో మిగిలిన 15 శాతం పాఠశాలల్లోని విద్యార్థులు బడికొచ్చినా రానట్లే అవుతోంది.

నమోదు చేయాల్సిందే

స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ యాప్‌లో అన్ని పాఠశాలలు తమ విద్యార్థుల హాజరు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను అందరూ పాటించాల్సిందే.

- తాహెరా సుల్తానా, డీఈవో

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని