logo
Published : 02/12/2021 06:05 IST

పరిహారం పెంపునకు రైతుల పట్టు


నిరసన తెలుపుతున్న వెంకటపాలెం, మందడం సాగుదారులు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన మందడం, వెంకటపాలెం గ్రామాల రైతులు తమకు పరిహారం పెంచి ఇవ్వాలంటూ బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. మండలంలోని వెంకటపాలెం సమీప సీడ్‌ యాక్సిస్‌ మార్గం పక్కన పనులు జరుగుతున్న ప్రాంతం వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లాడుతూ విజయవాడ నగరానికి 6 కి.మీ. దూరంలో మూడు పంటలు పండే తమ భూములకు కేవలం రూ.22 లక్షలు పరిహారం ప్రకటించటం అన్యాయమన్నారు. గొల్లపూడి సమీపంలోని కర్షకులకు గజాల లెక్కన అధిక పరిహారం చెల్లించారని, తమకేమో మార్కెట్‌ రేటు పరిగణనలో తీసుకోకుండా 1954 భూ సేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లిస్తామనడం దారుణమన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం చెల్లించాల్సిందేనన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీిం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. సీడ్‌ యాక్సిస్‌ రహదారి వద్ద త్వరలో 12 గంటల నిరాహార దీక్ష చేపతామన్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా చినకాకాని వరకు నాలుగో ప్యాకేజీ కింద జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. రూ.1133.85 లక్షల అంచనా వ్యయంతో సుమారు 3.200 కి.మీ పొడవున కృష్ణా నదిపై వంతెన, 17.881 కి.మీ. పొడవునా ఎన్‌ఎహెచ్‌ఏఐ ఆధ్వర్యంలో రహదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని