logo
Published : 03/12/2021 04:58 IST

11 గ్రామ సచివాలయాల్లో గృహాల రిజిస్ట్రేషన్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ సహాయంతో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు వాటిని వన్‌ టైం సెటిల్‌మెట్‌ (ఓటీఎస్‌) పథకంలో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తుంది. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా గృహాలను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జిల్లాలోని 11 గ్రామ సచివాలయాల పరిధిలోని గృహాల లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో పట్టాలు ప్రదానం చేస్తారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి గురువారం రాత్రి జిల్లా అధికారులకు ఉత్తర్వులు చేరాయి. నరసరావుపేట డివిజన్‌లో జొన్నలగడ్డ, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం గ్రామ సచివాలయాలతో పాటు తెనాలి డివిజన్‌లో సంగం జాగర్లమూడి, నందివెలుగు-1, 2, జగడగుంటపాలెం గ్రామ సచివాయాలు, గుంటూరు డివిజన్‌లో మోతడక, పాములపాడు, లాం, పొన్నెకల్లు-1 గ్రామ సచివాలయాల్లో గృహాల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఓటీఎస్‌ని వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల గృహ లబ్ధిదారులు రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, గుంటూరు నగరపాలక సంస్థలో రూ.20 వేలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు 11 గ్రామ సచివాలయాల్లో ఉచితంగా గృహాలను రిజిస్ట్రేషన్‌ చేస్తుండటంతో మిగిలిన గ్రామాల ప్రజలు కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని