logo
Published : 03/12/2021 04:58 IST

నర్సింగ్‌కు కఠిన పరీక్ష

ఈనాడు-అమరావతి

జింకానా ఆడిటోరియంలో కాళ్లపై ప్రశ్నపత్రం పెట్టుకుని సమాధానాలు రాస్తున్న నర్సింగ్‌ విద్యార్థులు

పరీక్షలు వారి తలరాతలను మార్చేవి. వీటిల్లో ప్రతిభ కనబరిస్తేనే వారికి కొలువులు దక్కేది. ఇంతటి కీలకమైన పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసుకునేలా ఏర్పాట్లు చేయలేకపోయిందనే విమర్శలను గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి మూటగట్టుకుంది. రెండురోజుల నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జీఎన్‌ఎం నర్సింగ్‌ విద్యార్థులకు తుది పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. కనీసం బల్లలు లేకుండా అసౌకర్యంగా పరీక్షలు రాయటమే అందుకు నిదర్శనం. కనీసం సమాధానాలు రాయటానికి బల్లలు ఏర్పాటు చేయలేదంటే అతిశయోక్తి కాదు. సర్దుకుపోయి రాయటానికి పాఠశాల విద్య చదివే చిన్నా, చితక పిల్లలు కానేకాదు. అహోరాత్రులు కష్టపడి చదివి పగలనక, రేయినక కొవిడ్‌ వంటి మహమ్మారిలోనూ ప్రాణాలకు తెగించి ఆసుపత్రుల్లో విధులు నిర్వహించిన వీరికి పరీక్షలు రాసుకోవటానికి కనీస ఏర్పాట్లు చేయకపోవటం యంత్రాంగం నిర్లక్ష్యాన్ని చాటుతోంది. పరీక్షలు రాయటానికి వీలుగా కుర్చీలకే అటాచ్‌చేసి ఉండే ప్యాడ్‌ వంటివి వేయకపోయినా కనీసం పొడవాటి టేబుళ్లు  ఏర్పాటు చేసి ఒక్కో బెంచికి ఇద్దరేసి విద్యార్థులను ఉంచి పరీక్షలు రాసేలా ఏర్పాటు చేసి ఉండాల్సిందనే భావన వ్యక్తమవుతోంది.  జింకానా ఆడిటోరియంలో ఫ్యాన్లులేని చోట టెంట్‌హౌస్‌ నుంచి కుర్చీలు తీసుకొచ్చి పరీక్షలు పెట్టడం  యంత్రాంగం తీరుగా ఉంది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని