logo
Published : 03/12/2021 04:57 IST

7 నుంచి దశలవారీ ఉద్యమం


సమావేశంలో మాట్లాడుతున్న విద్యాసాగర్‌

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: పీఆర్‌సీ సహా ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 7 నుంచి దశలవారీ ఉద్యమానికి జిల్లా సంఘం సమాయత్తమవుతుందని జిల్లా ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు వి.విద్యాసాగరరావు అన్నారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కులు, డిమాండ్లు, కనీస ఉద్యోగ భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర సంఘం తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. 70 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో పీఆర్‌సీ ఆలస్యం కావడం ఇదే ప్రథమమని, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ సొమ్ములు కూడా ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. వారంలో సీపీఎస్‌ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ ఊసే మరిచారని, ఉద్యోగుల సమన్వయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తగిన మూల్యం తప్పద న్నారు. అనేకసార్లు విజ్ఞాపన పత్రాలను ఇచ్చి విసిగిపోయి ఇప్పుడు పోరుబాట పడుతున్నామన్నారు. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలు సంయుక్తంగా చేపట్టే ఆందోళనల్లో భాగంగా 7, 8, 9 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, 10న జిల్లా , తాలూకా కేంద్రాల్లో భోజన విరామ ప్రదర్శనలు, 16న తాలూకా కేంద్రాల్లో, 21న జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు ఉంటాయన్నారు. పదవిలో ఉన్న మంత్రి వ్యవహారశైలికి నిరసనగా వీఆర్‌ఓల సంఘం చేపట్టే ఆందోళనకు తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. జిల్లా నాయకులు రాజబాబు, విజయవాడ నాయకులు స్వామి, స్థానిక నాయకులు బి.వెంకట్రావు, కుప్పాల శ్రీను, గెంటేల నారాయణరావు, రాటకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని