logo
Published : 04/12/2021 02:44 IST

పంటల బీమాలో అవకతవకలపై చర్యలకు డిమాండ్‌

వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న నాయకులు, రైతులు

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే : పంటల బీమా పరిహారంలో జరిగిన అవకతవకలను సరిజేయాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు దుర్వినియోగం చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామ శివారు తోడేళ్లదిబ్బ లంక రైతులు తమకు జరిగిన అన్యాయం గురించి శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావులకు వినతి పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ తోడేళ్లదిబ్బ లంకలో సుమారు 110 మంది చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు పసుపు, కంద, అరటి, బొప్పాయి మొదలైన వాణిజ్య పంటలు పండిస్తున్నారన్నారు. 2020లో వచ్చిన కృష్ణా నది వరదల్లో చేతికొచ్చిన పంటలు మొత్తం మునిగి నాశనం అయిపోయాయని చెప్పారు. ప్రభుత్వం వీరందరికీ పంటల బీమా ద్వారా నష్టపరిహారం అందిస్తామని చెప్పారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల వలన రైతులకు నష్ట పరిహారం అందకుండా పోయిందన్నారు. కౌలురైతులు, భూ యజమానులకు కాకుండా మూడో వ్యక్తికి పరిహారం వెళ్లిందన్నారు. పంట నష్టపోయిన వాస్తవ సాగుదారులకు బీమా పరిహారం  ఇప్పించాలన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, నాయకులు బైరగాని శ్రీనివాసరావు, పంచకర్ల రంగారావు, వై.లెనిన్‌, బడుగు మదన్‌ మోహన్‌, రైతులు విశ్వనాథపల్లి సాంబయ్య, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని