logo
Published : 04/12/2021 02:44 IST

వ్యవసాయంతోనే అభివృద్ధి సాధ్యం

మాట్లాడుతున్న ఆంగ్రూ వీసీ డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: దేశం సాంకేతిక రంగంలో ముందుకెళ్తున్నా వ్యవసాయ రంగాన్ని విస్మరించకూడదని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ఆంగ్రూ) ఉప కులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ వ్యవసాయ విద్య దినోత్సవాన్ని గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు వేలాదిగా బస్సుల్లో తరలివచ్చారు. సభకు లాంఫాం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ భారత తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా బాబూ రాజేంద్రప్రసాద్‌ చేసిన కృషితో వ్యవసాయంలో ప్రగతి సాధించినట్లు తెలిపారు. పాఠశాల దశలోనే వ్యవసాయం గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి, రైతులకు ఉపయోగపడేలా పరిశోధనలు చేస్తారన్నారు. సామాజిక విజ్ఞాన కళాశాల అసోసియేట్‌ డీన్‌, ఆంగ్రూ పాలకమండలి సభ్యులు జె.లక్ష్మి మాట్లాడుతూ ఇంజినీర్లు, వైద్యులుగా వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని, వ్యవసాయాన్ని విస్మరిస్తే భావి తరాలకు ఇబ్బందులు తప్పవన్నారు.

లాంఫాంలో విద్యార్థులకు క్షేత్ర ప్రదర్శన : విద్యార్థులను లాంఫాంలో ప్రయోగాత్మకంగా పండిస్తున్న పత్తి, కంది, మినుము, పెసర, తదితర పంటల వద్దకు తీసుకెళ్లారు. పంటల సేద్యం, మందుల పిచికారీ విధానం గురించి  శాస్త్రవేత్తలు వివరించారు. యూబీఐ ప్రాంతీయ కార్యాలయం డీజీఎం రవికుమార్‌, ఆంగ్రూ రిజిస్ట్రార్‌ గిరిధరకృష్ణ, వర్శిటీ అధికారులు త్రిమూర్తులు, రాంబాబు, యెల్లారెడ్డి, ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, రామారావు, మార్టిన్‌లూథర్‌, ప్రధాన శాస్త్రవేత్త గోపీకృష్ణ, లాంఫాం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట సేద్యం గురించి వివరిస్తున్న శాస్త్రవేత్తలు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని