logo
Published : 04/12/2021 02:44 IST

పడవలపై ఇసుక తరలింపునకు అనుమతివ్వండి

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు

కొత్తపేట, న్యూస్‌టుడే : పడవలపై ఇసుక తరలింపునకు అనుమతించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం స్థానిక మల్లయ్యలింగంభవన్‌లో శుక్రవారం జరిగింది. సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన కృష్ణా, గుంటూరు జిల్లాల కృష్ణానది పరివాహక ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా 250 పడవలపై ఇసుక ఎగుమతి, దిగుమతి చేసుకుంటూ సుమారు 100 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ప్రస్తుతం పడవల ర్యాంపులను మూసివేసి, డ్రెడ్జింగ్‌ యంత్రాల ద్వారా ఇసుక తీయడం వలన కార్మికులు పనులు కోల్పోయారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌ కుమార్‌, సంఘం ప్రతినిధులు అవుతు క్రాంతికుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి, కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని