logo
Published : 04/12/2021 02:44 IST

చిట్టీల పేరుతో రూ.కోట్లలో మోసం

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: చిట్టీల పేరుతో ఓ కుటుంబం రూ.7 కోట్లు టోకరా పెట్టి పరారైనట్లు బాధితులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్సై అజయ్‌బాబు, స్థానికుల కథనం.. మండలంలోని పొనుగుపాడులో ఏళ్లుగా నిడమనూరి భీమేశ్వరావు, సుబ్బాయమ్మ దంపతులు చిల్లర, వస్త్ర, మెడికల్‌ దుకాణం నడుపుతున్నారు. కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు. గ్రామస్థులు కొందరు రూ.3 కోట్లు దాకా చిట్టీలు కట్టారు. వీరితో పాటు గ్రామం చుట్టుపక్కలా నరసరావుపేట, గుంటూరులో ఉంటున్న కొందరు రూ.4 కోట్లు దాకా చిట్టీలకు సొమ్ము చెల్లించారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం విహారయాత్రల పేరిట భీమేశ్వరావు కుటుంబీకులు తమ ఇంటికి తాళం వేసి వెళ్లారు. వారు ఉద్దేశపూర్వకంగా గ్రామం నుంచి పారిపోయినట్లు ఆరోపిస్తూ బాధితులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై అజయ్‌బాబు తన సిబ్బందితో కలిసి సాయంత్రం గ్రామానికి వెళ్లి విచారించారు. ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయని దాచుకున్న సొమ్ము  చిట్టీల పేరుతో భీమేశ్వరావు కుటుంబానికి ఇచ్చామని గ్రామస్థులు వాపోతూ, తమకు న్యాయం చేయాలని ఎస్సైను వేడుకున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని