logo
Published : 04/12/2021 03:25 IST

21 నుంచి ‘గృహ హక్కు’ దస్తావేజుల పంపిణీ

ప్రచార పత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్‌ నివాస్‌, చిత్రంలో జేసీ శివశంకర్‌, శ్రీవాస్‌ నుపూర్‌, మోహన్‌కుమార్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా సదరు ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తోందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఈ పథకం ఈ నెల 20వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ క్రమంలో అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే రుసుము చెల్లించిన వారికి ఈనెల 21 నుంచి రుణ మాఫీతో పాటు, ఇంటి రిజిస్టర్‌ దస్తావేజులను అందించనున్నట్లు తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో గృహ హక్కు పథకంపై అవగాహన కల్పించే ప్రచార పత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరాల్లో రూ.20వేలు చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9,530 మంది లబ్ధిదారుల నుంచి రూ.8.55 కోట్లు మేర వసూలైనట్లు వెల్లడించారు.

ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంకండి

జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. మొత్తం 734 రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) కొనుగోళ్ల ప్రక్రియకు రంగం సిద్ధం చేయాలన్నారు. ఈ క్రమంలో మంగళవారం వీఆర్వోలు, వ్యవసాయ సహాయకులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులతో ఆర్బీకేల్లో సమావేశాలను నిర్వహించాలని సూచించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వ్యవసాయాధికారులు తదితరులతో వివిధ అంశాలపై శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసే సొసైటీలు రవాణా, హమాలీల ఛార్జీలు రైతుకు చేరేలా చూడాలన్నారు. ఈకేవైసీ 85 శాతం మేర పూర్తయినట్లు వెల్లడించారు. ఈకేవైసీ నమోదుకాని రైతులకు పంట నష్టం తరుణంలో పెట్టుబడి రాయితీ, బీమా సౌకర్యాలు రావని స్పష్టం చేశారు.

6న భారీగా కొవిడ్‌ టీకా

జిల్లాలో సోమవారం పెద్దఎత్తున కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. వైద్య సిబ్బంది, అధికారులు రెండు రోజులు ముందుగానే శనివారం సమావేశాలను నిర్వహించుకుని, ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వీసీకి విడిది కార్యాలయంలో జేసీలు కె.మాధవీలత, మోహన్‌కుమార్‌, డీపీవో జ్యోతి, సీపీవో భరత్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. జేసీ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ కంచికచర్ల నుంచి, మరో జేసీ (గృహాలు) శ్రీవాస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌ తిరువూరు నుంచి వీసీలో పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని