logo
Published : 04/12/2021 03:25 IST

ట్రూఅప్‌ నుంచి ఉపశమనం

ఈనాడు-అమరావతి

విద్యుత్తు వినియోగదారులకు ట్రూఅప్‌ ఛార్జీలు, ట్రూఅప్‌ సర్‌ఛార్జీల నుంచి ఉపశమనం లభించింది. ఆగస్టు నెల నుంచి వసూలు చేస్తున్న వీటిని వసూలుచేయవద్దని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి ఇప్పటికే ఆదేశించింది. దీంతో నవంబరు నెలలో ట్రూఅప్‌ ఛార్జీలు వసూలుచేయలేదు. తాజాగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వసూలుచేసిన ఛార్జీలను డిసెంబరు నెలలో ఇస్తున్న బిల్లులో సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది.   ఈమేరకు ప్రస్తుతం ఇస్తున్న బిల్లుల్లో గతంలో వసూలుచేసిన ఛార్జీల మొత్తాన్ని మినహాయిస్తున్నారు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లా పరిధిలో గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులకు రూ.191 కోట్ల మేర సొమ్ము ప్రస్తుత బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. దీంతో డిసెంబరు నెలలో విద్యుత్తు వినియోగదారులకు ఉపశమనం లభించనుంది.

ఏపీఈఆర్‌సీ నిర్ణయంతో

2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అప్పట్లో డిస్కంలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వడ్డీతో సహా ట్రూఅప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు  వసూలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబరు నెలలో ఇచ్చే బిల్లు నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబరు నెలలో బాదుడు మొదలైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారుల నుంచి రెండు నెలల్లో రూ.191 కోట్లు అదనంగా వసూలుచేశారు. దీంతో ఒక్కో కనెక్షన్‌పై 15 నుంచి 20 శాతం వరకు అదనంగా బిల్లు వచ్చింది.కరోనాతో అన్ని రంగాలు కుదేలై ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో విద్యుత్తు బిల్లుల మోత ప్రజల నడ్డి విరిచింది. అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి నవంబరు నెల నుంచి ట్రూఅప్‌ ఛార్జీల వసూలును నిలిపివేయాలని డిస్కంలను ఆదేశించింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని