logo
Published : 04/12/2021 03:25 IST

‘శ్రీమన్నారాయణ మృతి బాధాకరం’

శ్రీమన్నారాయణ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న  చంద్రబాబునాయుడు, పక్కన ఉమా తదితరులు

కంచికచర్ల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ మృతి తనను తీవ్రంగా బాధించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందిన శ్రీమన్నారాయణ భౌతిక కాయాన్ని కృష్ణా జిల్లా కంచికచర్ల తీసుకెళ్లారు. శుక్రవారం అక్కడికి చంద్రబాబు వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించిన శ్రీమన్నారాయణ, తన వారసులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రోత్సహించి అన్ని విధాలా సహకరించడం గొప్ప విషయమన్నారు. ఆయన కుమారుడు వెంకటరమణ అప్పట్లో తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తూ అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సమయంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తనను కలిచివేసిందని అన్నారు. ఒక్కోసారి హఠాత్తుగా విధి కాటేస్తుందని విచారం వ్యక్తం చేశారు. శ్రీమన్నారాయణ మృతి కూడా తెదేపాకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాని అన్నారు. తెదేపా ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ తిరుగు ప్రయాణమయ్యారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని