logo
Published : 04/12/2021 03:25 IST

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : కలెక్టర్‌

గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

జుఝువరం (గ్రామీణ పామర్రు), న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న పాలవెల్లువ లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ సూచించారు. శుక్రవారం పామర్రు మండలం జుఝువరంలో జగనన్న పాలవెల్లువ, ఓటీఎస్‌, ధాన్యం కొనుగోలు కేంద్రాల అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో తొలి విడతగా 303 గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలే సంఘాలుగా ఏర్పడి పాలసేకరణ చేసి డెయిరీకి పంపిస్తారన్నారు. అమూల్‌ పాల వెల్లువకు సంబంధించిన డేటా ఎంట్రీ కోసం గ్రామానికి దగ్గరలో విద్యుదీకరణ, అంతర్జాలం సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. జిల్లాలో 34 వేల మంది రైతులున్నారని ఈ పథకం ద్వారా వారందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి 45 నుంచి 60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, మైనార్టీలు, వితంతువులు అర్హులన్నారు.

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

జిల్లాలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద ఇంతవరకూ 10వేల మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకున్నారని మరో 60వేల మంది ఎంపికయ్యారన్నారు. జిల్లాలో 734 ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. రైతులు సొంతగా మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్తే రవాణా, మాలి ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఆర్బీకేల్లో గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం ఓటీఎస్‌లో నగదు చెల్లించిన వారికి రుణ విముక్తి పత్రాలు అందించారు. ఎంపీపీ దాసరి అశోక్‌కుమార్‌, సర్పంచి పుట్టి పున్నమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి లక్ష్మీనాంచారమ్మ, తహశీల్దార్‌ ఎన్‌.సురేష్‌బాబు, ఎంపీడీవో రామకృష్ణ, గృహ నిర్మాణ శాఖ డీఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని