Cyclone Jawad: తీవ్ర తుపానుగా దూసుకొస్తున్న ‘జవాద్‌’

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.

Updated : 04 Dec 2021 10:46 IST

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా దిశ మార్చుకుని రేపు మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది. 

రేపు రాత్రికి క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారుతుందని వివరించింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల  ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని