రసవత్తరంగా ఎడ్ల పోటీలు
కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాటి వీరుల తిరునాళ్లను పురస్కరించుకొని వైకాపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లపోటీలు రసవత్తరంగా సాగాయి. నాలుగు పళ్ల ఎడ్ల జతల పోటీలను వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. నాలుగు పళ్ల విభాగంలో నాదెండ్ల గ్రామానికి చెందిన చాగంటి చిననారాయణ మెమోరియల్, జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన సంకట నరేంద్రరెడ్డి ఎడ్లు సంయుక్తంగా 4625.2 అడుగుల దూరం బండలాగి ప్రథమ బహుమతి గెలుపొందాయి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం సింగంరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కాటం తిరుపతిరెడ్డి ఎడ్ల జత 4604 అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి సొంతం చేసుకున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన నుసుం బయ్యపరెడ్డి ఎడ్ల జత 4508.10 అడుగుల దూరం లాగి తృతీయ బహుమతి గెలుపొందాయి. ప్రకాశం జిల్లా ఖాజీపురం గ్రామానికి చెందిన వేగినాటి ఒసురారెడ్డి ఎడ్ల జత 4500 అడుగుల దూరం లాగి నాలుగో బహుమతి గెలుపొందాయి. చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్‌కే బుల్స్ అత్తోట శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి ఎడ్ల జత 4250 అడుగుల దూరం లాగి ఐదో బహుమతి గెలుపొందాయి. గురజాల గ్రామానికి చెందిన లింగా అంజయ్యచౌదరి ఎడ్లజత 4104.02 అడుగుల దూరం లాగి ఆరో బహుమతి గెలుపొందాయి.