logo
Published : 05/12/2021 04:58 IST

ఓటీఎస్‌ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌

మాట్లాడుతున్న రైతుకూలి సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్‌

కొత్తపేట, న్యూస్‌టుడే : వన్‌ టైమ్‌ సెంటిల్‌మెంట్(ఓటీఎస్‌) విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసముండే పేదలకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలని కోరుతూ శనివారం అరండల్‌పేటలోని మాదాల నారాయణస్వామి భవనంలో రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. మేకల ప్రసాద్‌ మాట్లాడుతూ డబ్బులు కోసమే 225 జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని మండిపడ్డారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ పట్టాలు ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు, బహుజన ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొంత సురేష్‌, కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌, రజక సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని