జిల్లా ప్రాజెక్టులకు ఇన్‌స్పైర్ మనక్ అవార్డులు
జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో విద్యార్థులు కీర్తి, విష్ణువర్దన్‌రెడ్డి, గైడ్ టీచర్లు శివనాగేశ్వరరావు, రమేష్
నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్ మనక్ 2019-20కి సంబంధించి జాతీయ స్థాయిలో గుంటూరు జిల్లా నుంచి ఎంపికైన రెండు ప్రాజెక్టుల విద్యార్థులు శనివారం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో అవార్డులు స్వీకరించారు. ఈ అవార్డు కింద ల్యాప్‌టాప్, విద్యార్థి ఆవిష్కరణకు పేటెంట్ హక్కులు కూడా అందించారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు రాష్ట్రం నుంచి ఆరు ప్రాజెక్టులు ఎంపికవ్వగా, గుంటూరు జిల్లా నుంచి రెండు వెళ్లాయి. అత్తోట పాఠశాల విద్యార్థి పొగడదండ కీర్తి ‘వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కూల్ కార్ట్’ తయారు చేశారు. దీనికి గైడ్ టీచర్‌గా రాయపాటి శివనాగేశ్వరరావు వ్యవహరించారు. దుర్గి మండలం ఓబులేశునిపల్లె హైస్కూల్ విద్యార్థి గుమ్మితి విష్ణువర్దన్‌రెడ్డి ‘ఎయిర్ బ్యాగ్ ప్రొటక్షన్ ఫర్ బైకర్స్’ ప్రాజెక్టును తయారు చేయగా గైౖడ్ టీచర్‌గా ఆలేటి రమేష్ వ్యవహరించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు వి.సుబ్బారావు, డీఈవో ఆర్.ఎస్.గంగాభవాని, జిల్లా సైన్సు అధికారి ఎ.ఎ.మధుకుమార్, ఉప విద్యాశాఖాధికారులు అభినందించారు.