logo

మెరుపులా మెరిసి... తీగలా సాగి

జిమ్నాస్టిక్స్‌ ప్రత్యేకత వేరు. వేగం, ఏకాగ్రత, కళ్లు చెదిరే విన్యాసాలు క్రీడ ప్రత్యేకతను చాటిచెబుతాయి. జిల్లాలో 70 మంది వరకు ఆటగాళ్లుండగా ఇందులో 25 మంది వరకు జాతీయస్థాయిలో మెరిపిస్తున్నారు. గుంటూరు బీఆర్‌

Published : 05 Dec 2021 04:56 IST

జిమ్నాస్టిక్స్‌ ప్రత్యేకత వేరు. వేగం, ఏకాగ్రత, కళ్లు చెదిరే విన్యాసాలు క్రీడ ప్రత్యేకతను చాటిచెబుతాయి. జిల్లాలో 70 మంది వరకు ఆటగాళ్లుండగా ఇందులో 25 మంది వరకు జాతీయస్థాయిలో మెరిపిస్తున్నారు. గుంటూరు బీఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న జిమ్నాస్టిక్స్‌ శిక్షణ.... విద్యార్థుల ఆత్మవిశ్వాసం, అంకితభావాన్ని చాటిచెబుతోంది. ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి 70 మంది విద్యార్థులు హాజరవుతూ ఫ్లోర్‌ పై సందడి చేస్తున్నారు. కళ్లుచెదిరే ఫీట్లు, నమ్మకశ్యం కాని భంగిమలు చూడాల్సిందే. ఆర్టిస్టు, రిథమిక్‌, ఆక్రోబాటిక్‌, ఏరోబిక్‌, ట్రంపోలిన్‌, తంబ్లిన్‌  విభాగాలుంటాయి. ఆర్టిస్టు విభాగంలోనే ఫ్లోర్‌ ఎక్సర్‌ సైజు, పామిల్‌ హార్స్‌, రోమన్‌ రింగ్స్‌, చేబుల్‌ వాల్ట్‌, ప్యారలల్‌ బార్స్‌, హారిజాంటల్‌ బార్స్‌ అంశాలు ఉంటాయి. మహిళలకు ప్రత్యేకించి అనీవన్‌ బార్స్‌, బ్యాలెన్సింగ్‌ బీమ్స్‌ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందుతున్నవారిలో దాదాపుగా అందరూ పేద, మధ్యతరగతి పిల్లలే. కోచ్‌ అప్రోజ్‌ ఖాన్‌ వీరి పట్టుదలకు అండగా నిలుస్తున్నారు. జాతీయస్థాయిలో పోటీ పడేందుకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని.... ఫోమ్‌ ఫిట్‌ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.

-ఈటీవీ, గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని