logo

Akhanda: అఖండ తెరపై కొప్పురావూరు బసవ

ఇటీవల విడుదలైన అఖండ చిత్రంలో ఒంగోలు గిత్తల సందడి అంతా ఇంతా కాదు. బాలకృష్ణతో బసవా అని పిలిపించుకోవటమే కాకుండా ప్రేక్షకుల్ని మైమరపించాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ....

Published : 05 Dec 2021 06:57 IST

ఈటీవీ, గుంటూరు-న్యూస్‌టుడే, పెదకాకాని: ఇటీవల విడుదలైన అఖండ చిత్రంలో ఒంగోలు గిత్తల సందడి అంతా ఇంతా కాదు. బాలకృష్ణతో బసవా అని పిలిపించుకోవటమే కాకుండా ప్రేక్షకుల్ని మైమరపించాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు 16 ఏళ్లుగా ఈ ఒంగోలు జాతి ఎద్దులను పెంచుతున్నారు. ప్రధానంగా బండలాగుడు పోటీల కోసం వీటిని పంపిస్తుంటారు. ఇప్పుడు తొలిసారిగా సినిమాలో ఆయన ఎద్దులు మెరిశాయి. అఖండ సినిమాలో ఆరంభ సన్నివేశంతో పాటు ముగింపులోనూ ఎద్దులు కనిపించాయి. సినిమా కథలో వీటిది కీలకపాత్ర. దర్శకుడు బోయపాటి శ్రీను ఎద్దుల కోసం ఆరా తీస్తున్నప్పుడు ఆయన సొంతూరు పెదకాకానికి సమీపంలోని కొప్పురావూరులోనే తన సినిమా పాత్రలకు తగిన ఎద్దులు కనిపించాయి. సినిమా షూటింగ్‌ కోసం ఎద్దులు కావాలని యజమానిని బోయపాటి అడిగారు. ఆయన సరేనన్నారు. వేగంగా పరిగెత్తడం, ఆగటం వంటి అంశాలపై ఇంటి వద్దే శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో 10 రోజులు, తమిళనాడులోని అరుణాచలం సమీపంలో 20రోజులు షూటింగ్‌ జరిగింది. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు వీలుగా ఎద్దులతో అలాంటి స్టంట్లే చేయించారు. . బసవ పాత్రలో ఉన్న ఎద్దు ఇటీవలే అనారోగ్యంతో మరణించింది. మరొక దానిని అమ్మివేశాను’ అని యజమాని శ్రీనివాసరావు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని