గుంటూరులో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు
గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ నాయకులు రవీంద్రనాథ్, ఓబులేసు, వెంకటరామారావు, తదితరులు
గొల్లపూడి, న్యూస్టుడే: ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభలు జనవరి 29, 30, 31 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను గొల్లపూడిలోని ఏఐటీయూసీ భవనంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ... ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం లేదని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ అధ్యక్షుడు వెంకటరామారావు, నాయకులు రాధాకృష్ణమూర్తి, వెంకటసుబ్బయ్య, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.