logo

వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

రాష్ట్రంలో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. చిత్తురు, నెల్లూరు, కడప, అనంతరపురం జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా

Published : 05 Dec 2021 04:56 IST


విరాళాలు సేకరిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి శంకర్‌

విద్యాధరపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. చిత్తురు, నెల్లూరు, కడప, అనంతరపురం జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు సీపీఐ నగర శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీ శివాలయం వీధిలో విరాళాల సేకరణను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ ఇంతవరకు వరద బాధితులను ఒక్క కేంద్రమంత్రి పరామర్శించక పోవడం.. రాష్ట్రంపై కేంద్ర వివక్షతకు నిదర్శనమని ఆరోపించారు. అవసరమైతే వరదబాధితుల కోసం దిల్లీలో కూడా తమ వాణిని వినిపిస్తామన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కార్యవర్గ సభ్యులు కొట్టు రమణారావు, యాకోబ్‌, డి.వి.రమణబాబు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భారతి, ప్రధానకార్యదర్శి దుర్గాంబ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని