logo

నూతన విద్యా విధానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధ్యం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాక్షాత్కారమవుతుందని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌డి సహస్ర బుద్ధే అన్నారు. శనివారం విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో

Published : 05 Dec 2021 04:56 IST


 

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌డి సహస్ర బుద్ధే, పక్కన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, తదితరులు

కానూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో ఆత్మనిర్భర్‌ భారత్‌ సాక్షాత్కారమవుతుందని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌డి సహస్ర బుద్ధే అన్నారు. శనివారం విజయవాడలోని కానూరు వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో నాగార్జున ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కళాశాల నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ విద్యా విధానం.. రానున్న 15 ఏళ్లలో దేశానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశాబ్దంలో డిజిటల్‌ ఇండియా, అనంతరం మేకిన్‌ ఇండియా.. ప్రస్తుతం ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలతో జాతిని జాగృతం చేస్తున్నామన్నారు. మరో 15 ఏళ్లలో ప్రతి కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కళాశాల తరఫునే విద్యార్థులకు డిగ్రీ పట్టాను అందించే రోజులు రానున్నాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కళాశాలలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కన్వీనర్‌ మలినేని రాజయ్య, ప్రిన్సిపల్‌ ఏవీ రత్నప్రసాదు, నాగార్జున విద్యా సంసంస్థల అధినేత రమేష్‌  కుమార్‌, వివిధ దేశాల ప్రతినిధులు, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని