logo

ఆరుబయట చదువుతూ నిరసన

జగ్గయ్యపేటలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్‌జీఎస్‌) ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం కూడా కొనసాగింది. విద్యార్థులు ఆరుబయట

Updated : 05 Dec 2021 05:00 IST


కళాశాల వెలుపల కూర్చున్న విద్యార్థులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేటలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్‌జీఎస్‌) ఎయిడెడ్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం కూడా కొనసాగింది. విద్యార్థులు ఆరుబయట కూర్చొని చదువుతూ నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ప్రణయ్‌తేజ ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలో సంఘ నేతలు మాట్లాడుతూ... 35, 42, 50 జీఓలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాల పూర్వ విద్యార్థులు కాసరగడ్డ నాగేశ్వరరావు, రామనాథం మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో వంశీ, రాజు, ప్రదీప్‌, చంద్రమౌళి, పవన్‌సాయి, నర్మదా, జూహిదా, రమ్య, కళ్యాణి, ప్రత్యూష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని