logo

ఉత్తమ వైద్యులుగా రాణించాలి

ప్రజలకు చక్కని వైద్య సేవలు అందిస్తూ ఉత్తమ వైద్యులుగా ఖ్యాతి గడించాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.కె.శంకర్‌, ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డా.జి.యుగంధర్‌ సూచించారు.

Published : 05 Dec 2021 04:56 IST


వైద్య విద్యార్థినికి డాక్టరేట్‌ అందజేస్తున్న డా.కె.శంకర్‌, డా.జి.యుగంధర్‌, నాగేశ్వరరావు, డాక్టర్‌ రామోజీరావు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజలకు చక్కని వైద్య సేవలు అందిస్తూ ఉత్తమ వైద్యులుగా ఖ్యాతి గడించాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.కె.శంకర్‌, ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డా.జి.యుగంధర్‌ సూచించారు. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని డాక్టర్‌ సుధా, నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలోని బీడీఎస్‌-2016, ఎమ్‌డీఎస్‌-2018 విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. సిద్ధార్థ అకాడమీ ప్రతినిధులతో కలిసి వైద్య కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామోజీరావుతో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. భగవంతుడి తర్వాత భగవంతుడిగా ప్రజలు విశ్వసించేంత గొప్ప అదృష్టం ఒక్క వైద్యులకే దక్కిందని చెప్పారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో మరింతగా బలపరిచేలా సమాజంలో మెలుగుతూ.. వ్యక్తిగతంగా, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని నూతన వైద్య బృందానికి సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి, బహుమతులు అందజేశారు. కళాశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డా.పి.ఎస్‌.ఎన్‌.మూర్తి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని