Published : 05 Dec 2021 04:56 IST
రుణం కావాలా?..మిక్సర్ గ్రైండర్ కొనండి
ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: తక్కువ వడ్డీకి రుణం కావాలంటే మిక్సర్ గ్రైండర్ కొనండి అంటూ ఓ మోసగాడు మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన మూలపాడు, గుంటుపల్లి పరిసర గ్రామాల్లో చోటుచేసుకుంది. వెంకట సత్యప్రసాద్ మరికొందరు బృందంగా ఏర్పడి సులభ వాయిదాల్లో కట్టుకునేలా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని మహిళలకు నమ్మబలికారు. రూ.50 వేలు రుణం కావాలంటే పది మంది మహిళలు సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.1800 విలువ చేసే మిక్సర్ గ్రైండర్ కొనాలని చెప్పాడు.వందమంది కొన్నారు. నాణ్యత నాసిరకంగా ఉండటంతో అసలు విషయం బయటపడింది.
Tags :