logo
Updated : 06 Dec 2021 02:32 IST

చిత్రవార్తలు

పోలి స్వర్గం.. కాంతి మార్గం

కార్తికమాసం ముగింపు, పోలి స్వర్గం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున విజయవాడ కృష్ణానదీ తీరం దీపకాంతులతో శోభిల్లింది. మహిళలు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కుకున్నారు.

- ఈనాడు, అమరావతి


ఆలోచన.. ఆకర్షణ

రుచికరమైన వంటకాలే కాదు.. ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా హోటళ్లను తీర్చిదిద్దుతున్నారు నిర్వాహకులు. బెంజిసర్కిల్‌ సమీపంలో బొమ్మ రైలు తరహాలో, నిడమానూరు వద్ద విమానంలో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసి భోజనప్రియులను
ఆకట్టుకుంటున్నారు.

నిడమానూరు సమీపంలో విమానంలో..

బెంజిసర్కిల్‌ : రైల్లో వస్తున్న బిర్యానీ 

-ఈనాడు, అమరావతి


మహిషాసుర సంహారం..

విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన అమరావతి నృత్యోత్సవం కార్యక్రమంలో పురులియా చాహు అకాడమీ (జార్ఖండ్‌) కళాకారుల మహిషాసురమర్దిని నృత్యరూపకం.

- ఈనాడు, అమరావతి


లక్ష్యానికి అడ్డుగా...

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఉపయోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైక్లింగ్‌ చేసే యంత్రాలను నగరంలోని పలుచోట్ల నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. నిర్వహణ మాత్రం మరిచింది. లెనిన్‌ సెంటర్లో చిరు వ్యాపారులు యంత్రానికి అడ్డుగా తోపుడుబండ్లు ఉంచడంతో కనిపించడం లేదు.

-ఈనాడు, అమరావతి


ఆకట్టుకున్న బాబాసాహెబ్‌ ప్రతిమ

మూడు టన్నుల బరువున్న 75 వేల ఇనుప నట్లతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని రూపొందించారు. తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు. పధ్నాలుగడుగుల ఎత్తున్న ఈ ప్రతిమ తయారీకి మూడు నెలల సమయం పట్టిందని, త్వరలో తాము బెంగళూరులో ఏర్పాటుచేయనున్న ఇనుప విగ్రహాల ప్రదర్శనలో దీన్ని ఉంచుతామని ఆయన చెప్పారు. కాగా ఆదివారం తెనాలి వహాబ్‌రోడ్డులోని సూర్య శిల్పశాల వద్ద ప్రదర్శనగా ఉంచిన ఈ విగ్రహాన్ని సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, పురపాలిక ఛైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఖాలెదానసీమ్‌ శిల్పిని అభినందించారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌


నమ్మండి.. తోటకూర మొక్కే

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో బ్రహ్మాంజనేయులు అనే వ్యక్తి తన ఇంటి పెరటిలో వేసిన తోట కూర మొక్క ఆసాధారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగి అందరినీ ఆకర్షిస్తోంది. తాను బందరు నుంచి విత్తనాలు తెచ్చి చల్లగా, వాటిలో ఒక మొక్క ఇలా పెరిగిందని ఆయన చెప్పారు. దీనిపై ఉద్యాన అధికారి హారికను న్యూస్‌టుడే సంప్రదించగా మాములుగా తోటకూర మొక్కలు 3 నుంచి 4 అడుగులు పెరుగుతుంటాయని, జన్యుపరమైన కారణాలతో ఒక్కోసారి ఇలా జరుగుతుందన్నారు.

-న్యూస్‌టుడే, పెదనందిపాడు

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని