Published : 06 Dec 2021 01:35 IST
ఉద్యోగ జేఏసీ కార్యాచరణ అమలుకు కమిటీ
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం అమలు పరిచే కార్యాచరణ కోసం ప్రత్యేక వాణి విన్పించేందుకు కమిటీ ఏర్పాటయ్యింది. తూర్పు శాఖ అధ్యక్షుడు పి.రాము, ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న శ్యాంనాద్ను తూర్పుశాఖ సహాయ అధ్యక్షులుగా, జిల్లా విద్యాశాఖలో విధులు నిర్వహించే శ్రీనివాస్‌ను ఉపాధ్యక్షులుగా, బందరు ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగి శ్రీనివాసరాజును మచిలీపట్నం నగర యూనిట్‌కు సహాయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags :