logo

తక్షణ స్పందనతో తప్పిన ప్రమాదం

గుంటూరు జిల్లా నుంచి కుటుంబ సభ్యులతో సాగరసంగమానికి వచ్చి సముద్రంలో స్నానమాచరించే సమయంలో అలల ధాటికి పిల్లలు పడిపోతుంటే వారిని కాపాడే క్రమంలో ఓ తల్లి నీటిలో పడిపోయింది.

Published : 06 Dec 2021 01:35 IST

అపస్మారక స్థితిలో ఉన్న మహిళకు ప్రాథమిక వైద్యం చేస్తున్న కానిస్టేబుల్‌

హంసలదీవి(కోడూరు), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా నుంచి కుటుంబ సభ్యులతో సాగరసంగమానికి వచ్చి సముద్రంలో స్నానమాచరించే సమయంలో అలల ధాటికి పిల్లలు పడిపోతుంటే వారిని కాపాడే క్రమంలో ఓ తల్లి నీటిలో పడిపోయింది. స్థానిక యువకులు, మెరైన్‌ పోలీసులు తక్షణమే స్పందించడంతో ఆమెను ఒడ్డుకు చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా పొన్నూరు మండలం తెలగపాలెం గ్రామం నుంచి ఒక ఆటోలో ఆదివారం సాగరసంగమానికి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. స్నానాలాచరించడానికి డాల్ఫిన్‌ భవనం ఎదుట సముద్రంలో దిగగా.. అలల ధాటికి ఇద్దరు పిల్లలు పడిపోతుండడంతో తల్లి పోతబోయిన లక్ష్మి గమనించి వారిని కాపాడింది. ఈక్రమంలో ఆమె నీటిలో పడిపోవడంతో అక్కడే ఉన్న యువకులు స్పందించి మెరైన్‌ పోలీసుల సహకారంతో ఆమెను సరైన సమయానికి ఒడ్డుకు చేర్చారు. ఈలోపే నీటిని మింగేసి అపస్మారక స్థితికి చేరిన ఆమె పొట్ట నుంచి నీటిని తొలగించి... ప్రథమ చికిత్స చేసిన వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరైన్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు, హోంగార్డు బోసుబాబు, అక్కడే ఉన్న యువకులు సాయంతో ఆమెను కాపాడారు. దీంతో ఆకుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం ఆమె క్షేమంగా ఉన్నట్లు మెరైన్‌ పోలీసు సిబ్బంది జిలాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని