logo
Published : 06 Dec 2021 02:56 IST

‘జగన్‌ను గద్దె దింపడమే ధ్యేయం’

మాట్లాడుతున్న మహమ్మద్‌ నసీర్‌

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఒక్క అవకాశం ఇవ్వమని ప్రజల్ని ప్రాధేయపడి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అన్నింటా విఫలమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దింపడమే ధ్యేయంగా అందరూ ముందుకు సాగాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం గౌరవసభ జరిగింది. నసీర్‌ మాట్లాడుతూ ‘జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవ శాసనసభను కౌరవసభగా మారుస్తున్నారు. ఇసుక ధరలు మొదలుకుని విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇష్టం వచ్చిన విధంగా పెంచారు. పింఛను పెంపు, అమ్మఒడి హామీలు తుంగలో తొక్కారు. ఇలా జగన్‌ వైఫల్యాల జాబితా చాంతాడంతా ఉంటుంది’.. అని ధ్వజమెత్తారు. నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సంక్షేమ పథకాల్లో ఏవిధంగా కోత పెడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టర్‌ మాట్లాడుతూ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అసెంబ్లీకి పంపే వరకు ప్రతిఒక్కరూ వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు ఎల్లావుల అశోక్‌, ముప్పారపు భారతి, పోతురాజు సమత, తెదేపా నాయకులు గోళ్ల ప్రభాకర్‌, గుడిమెట్ల దయార్నతం, హసన్‌బాషా, ఎర్రగోపు నాగేశ్వరరావు, తెలుగు మహిళ నాయకురాళ్లు వాణి, పద్మావతి, శైలజ, మల్లిక పాల్గొన్నారు. 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని