Published : 06 Dec 2021 02:56 IST
ఉద్యాన అతిథిగృహంలో జూదం
నిందితుల అరెస్టు, నగదు స్వాధీనం
జప్తుచేసిన నగదు పరిశీలిస్తున్న డీఎస్పీ సుప్రజ, సీఐ హైమారావు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : చుట్టుగుంట సమీపంలోని ఉద్యాన అతిథిగృహంలో జూదమాడుతున్నారనే సమాచారంతో పశ్చిమ డీఎస్పీ సుప్రజ, నగరంపాలెం సీఐ హైమారావు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేసి, వారి వద్ద రూ.11,74,160 నగదు జప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ హైమారావు తెలిపారు. జూదరులు నగరంలోని ఓ ప్రజాప్రతినిధి అనుచరులని ప్రచారం సాగుతోంది.
Tags :