logo

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు భాజపా కృషి

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కేంద్రంలోని భాజపా కృషి చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. గుంటూరు జీటీ రోడ్డులోని పొగాకు బోర్డు అసోసియేషన్‌ హాల్లో భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర

Published : 06 Dec 2021 02:56 IST

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

జ్యోతి వెలిగిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ, పక్కన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జయప్రకాష్‌నారాయణ తదితరులు

నగరంపాలెం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కేంద్రంలోని భాజపా కృషి చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. గుంటూరు జీటీ రోడ్డులోని పొగాకు బోర్డు అసోసియేషన్‌ హాల్లో భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారానే బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారని తెలిపారు. అంబేడ్కర్‌ పంచ తీర్థాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వివరించారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ గొప్ప నిర్ణయం తీసుకొని అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించేలా దేశ వ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దిన వేడుకలు నిర్వహిస్తున్నారని వివరించారు. కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జి  వల్లూరు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పీఠిక ప్రజల రోజువారీ జీవితాల్లో భాగంగా మారాలన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో పఠనం చేయాలని, అదే మన లక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, నాయకులు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, కిరణ్‌, శ్రీనివాస్‌, బుజ్జిబాబు, దారా అంబేడ్కర్‌, లక్ష్మణ్‌, కంతేటి బ్రహ్మయ్య, బుల్లిబాబు, భగవాన్‌దాస్‌, స్వరూపరాణి, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సోము వీర్రాజు నగరంలోని భాజపా సీనియర్‌ నాయకుడు, బిల్డింగ్‌ కమిటీ ఛైర్మన్‌ సైదారెడ్డి ఇంటికి వెళ్లారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని