Published : 06 Dec 2021 17:16 IST
Ap News: నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యం: కేంద్రం
దిల్లీ: నిర్ణీత గడువులోగా పోలవం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని కేంద్ర జల్‌శక్తి శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని తేల్చి చెప్పింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం చెప్పింది. ‘‘వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోంది. కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ప్రాజెక్టు స్పిల్‌వే ఛానల్ పనులు 88 శాతం, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. పైలట్ ఛానల్ పనులు 34 శాతమే పూర్తయ్యాయి. పోలవరం సవరించిన అంచానాలు రూ.55,548 కోట్లకు టీఏసీ ఆమోదం తెలపడం నిజం’’ అని కేంద్ర జల్‌శక్తి శాఖ తెలిపింది.
ఇవీ చదవండి
Tags :