logo

సామాజిక మాధ్యమాల్లోచిన్నారుల నీలి చిత్రాలు

విజయవాడ ఫకీరుగూడెంకు చెందిన సొహెల్‌ అహ్మద్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. చిన్నారుల నీలిచిత్రాలను కొనుగోలు చేసి, వాటిని ఇతరులకు విక్రయిస్తూ ఇటీవలే విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా

Published : 07 Dec 2021 08:13 IST

విజయవాడకు చెందిన అయిదుగురిపై కేసు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ ఫకీరుగూడెంకు చెందిన సొహెల్‌ అహ్మద్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. చిన్నారుల నీలిచిత్రాలను కొనుగోలు చేసి, వాటిని ఇతరులకు విక్రయిస్తూ ఇటీవలే విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా ఇలాంటి వారిపై సీబీఐ తనిఖీలు చేపట్టగా.. వీరిలో నగరానికి చెందిన సొహెల్‌ అహ్మద్‌ ఉన్నాడు. అతడిని ఇటీవలే అరెస్టు చేశారు. తాజాగా ఇలాంటి ఘటనలనే మరి కొన్ని విజయవాడలో వెలుగులోకి వచ్చాయి. చిన్నారుల నీలిచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు సీఐడీ గుర్తించింది. సీఐడీ అదనపు డీజీ ఆదేశాల మేరకు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నగరానికి చెందిన మరో అయిదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ అయిదుగురు.. చిన్న పిల్లల నీలిచిత్రాలను జీ మెయిల్‌, ఫేస్‌బుక్‌, యూ ట్యూబ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీనిపై స్పష్టమైన సమాచారం రావటంతో పోలీసులు నిఘా ఉంచారు. నిందితుల పేర్లు, ఇతర వివరాలను చరవాణి నెంబర్లతో సహా గుర్తించారు. సీఐడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు సైబర్‌ క్రైం ఎస్సైలు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు.

ఐపీ చిరునామాల ఆధారంగా..

ఈ అయిదుగురిలో నలుగురి పూర్తి వివరాలు లభ్యం కాగా, ఒకరి వివరాలు తెలియరాలేదు. చరవాణి నెంబర్లు ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టారు. త్వరలో వీరందరినీ అరెస్టు చేసేందుకు సైబర్‌ క్రైం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. పోస్కో చట్టం ప్రకారం యుక్త వయసులోపు ఉన్న వారితో అభ్యంతరకరమైన చిత్రాలు తీయడం పూర్తిగా నిషేధం. చిత్రాలు తీసినా, సేకరించినా, చూసినా, ఇతరులకు పంపినా కూడా నేరం కిందకు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో శోధించే వారిపైనా నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నిఘా పెట్టింది. వారి వారి ఐపీ చిరునామాల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని