logo

నేటి నుంచి ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రెండు ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల సాధనే ధ్యేయంగా ఒకే తాటిపైకి వచ్చాయి. ఇందులో భాగంగా నగరంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో

Published : 07 Dec 2021 04:30 IST

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్‌, రామకృష్ణ, అప్పారావు, ప్రవీణ్‌రెడ్డి, రవీంద్ర తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రెండు ఉద్యోగ సంఘాలు.. తమ సమస్యల సాధనే ధ్యేయంగా ఒకే తాటిపైకి వచ్చాయి. ఇందులో భాగంగా నగరంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఏపీ అమరావతి ఐకాస, ఏపీ ఎన్జీవో ఐకాస జిల్లా శాఖ నాయకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. ఉద్యమంలో పాలు పంచుకుని, జయప్రదం చేయాలని కోరారు. తమ పోరాట కార్యాచరణ ప్రణాళికలను వినతి పత్రాల ద్వారా ఆయా కార్యాలయాల ముఖ్య అధికారులకు ముందస్తుగా తెలియజేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆర్టీసీ డిపోలతో సహా ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి, విధులకు హాజరవుతారని, 10న భోజన విరామ సమయంలో నిరసన, 13న పూర్వపు తాలూకా కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాల్లో ర్యాలీలు, 16న కార్యాలయాల ఎదుట ధర్నా, 21న జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తమ కార్యాచరణ తెలియజేశారు. పీఆర్సీ, కరవు భత్య బకాయిలు, సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. నగరంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఉద్యోగులను పోరు బాటలో పాల్గొనాలని కోరారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌కు కార్యాచరణతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాస్‌, విజయవాడ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బత్తిన రామకృష్ణ, సి.హెచ్‌.అప్పారావు, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్ర, ఏపీ ఎన్జీవో నగర అధ్యక్షుడు పి.స్వామి, కార్యదర్శి సంపత్‌, జిల్లా నాయకుడు సతీష్‌, వీఆర్వోల సంఘ నేతలు బాజీ, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని