రూ.400 కోట్లు ఎలా మళ్లిస్తారు?
నిబంధనలు తుంగలో తొక్కి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లు ఎలా మళ్లిస్తారని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు. గత వారం రోజులుగా యూనివర్సిటీ నిధులపై ఆందోళన చేస్తున్న
Published : 07 Dec 2021 04:30 IST
అంబేడ్కర్‌కు నివాళులర్పించి నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐకాస నాయకులు అక్కిరాజు, నరసింహారావు, నారాయణ, వాసు తదితరులు
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: నిబంధనలు తుంగలో తొక్కి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్లు ఎలా మళ్లిస్తారని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రశ్నించారు. గత వారం రోజులుగా యూనివర్సిటీ నిధులపై ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సోమవారం ఆయన మద్దతు ప్రకటించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అపాయింట్మెంట్ కోరామని, నిధుల విషయమై మాట్లాడతానన్నారు. తొలుత వీసీ శ్యాంప్రసాద్‌తో ఉద్యోగ ఐకాస నాయకులు, ఎమ్మెల్సీ చర్చించారు. ఉద్యోగుల భద్రత, విశ్వవిద్యాలయ నిర్వహణపై దృష్టి సారించి నిధులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ 1998ను రద్దు చేయాలన్నారు. ఉద్యోగుల, కార్మికుల సంఘ నాయకులు కోటేశ్వరరావు, భానుప్రసాద్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, ఐకాస నాయకులు అక్కిరాజు, నరసింహారావు, నారాయణ, వాసు, పోతురాజు పాల్గొన్నారు.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM