logo
Published : 07/12/2021 04:42 IST

అలరించిన కోడిపోరు

 ఉత్సాహంగా పల్నాడు  వీరారాధన ఉత్సవాలు

కారంపూడి, న్యూస్‌టుడే : పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోడిపోరును సోమవారం వీర విద్యావస్తులు రక్తి కట్టించారు. స్థానిక వీర్ల దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోడిపోరు గరిడీలో అలనాడు మాచర్ల, గురజాల రాజులు, బ్రహ్మన్న, నాగమ్మ సారథ్యంలో రాజ్యాలను పణంగా పెట్టి పోరుకు సిద్ధపడిన తీరునే నేడు ఈ క్రతువు నిర్వహించారు. మాచర్ల రాజ్యం తరఫున బ్రహ్మన్న వేషధారిగా పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిట్టిమల్లు కోడితో పోరుకు సిద్ధపడగా, గురజాల రాజ్యం తరఫున నాగమ్మ వేషధారిణిగా ఆచారవంతునితో కలిసి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సివంగి డేగ కోడితో పోరుకు దిగారు. గరిడీలో ఇరువర్గాలు ఎదురెదురుగా ఆశీనులవగా అలనాటి సంఘటనలను విర విద్యావస్తులు కథగానం చేస్తుండగా మూడు దఫాలుగా కోడిపోరు జరిపారు. నాటకీయ పరిణామాలను చూపుతూ రెండు పందేల్లో బ్రహ్మన్న కోడిని గెలిపించి, మూడో పందెంలో నాగమ్మ కోడి ప్రతాపానికి బ్రహ్మన్న కోడి ఓడిపోయినట్లుగా చూపి అరణ్యవాసాన్ని మాచర్ల పరివారం పొందినట్లుగా వివరించారు.

కోడిపోరులో నాగమ్మ వొషేధారణలో ఆచారవంతుడు, ఎమ్మెల్సీ జంగా

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వీర్ల దేవాలయం, చెన్నకేశవస్వామి, అంకాళమ్మ దేవాలయాల్లో పూజలు చేశారు. ఉదయం వీరుల కొణతాలకు (ఆయుధాలకు) నాగులేరు గంగదారి మడుగులో పవిత్ర స్నానాలు చేయించి వీరగంధం పూసి ప్రత్యేకంగా అలంకరించారు. వీర్ల దేవాలయంలో సంతానం కోరే మహిళలు ఒడి చాపగా ఉత్సవానికి సిద్ధమైన కొణతాలు జలతరింపులు చేశారు. అనంతరం గ్రామోత్సవంగా కొణతాలను తీసుకొని ఆచారవంతులు చెన్నకేశవస్వామి, బ్రహ్మన్న విగ్రహం, అంకాళమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి శంకుతీర్థం తీసుకొని నామతీర్థ మండపం చేరారు. అక్కడ ఆచారం ముగించి తెల్లవార్లు గ్రామంలోని ప్రతి వీధిలో కొణతాలను తీసుకొని తిరిగారు. సాయంత్రం వీర్ల దేవాలయ మండపంలో వీరవిద్యావస్తులు కోడిపోరు ఘట్టాన్ని గానం చేస్తుండగా వీరావేశానికి లోనైన ఆచారవంతులు కత్తిసేవ చేయటం చూపరులను కట్టి పడేసింది. దీంతో ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోడిపోరు క్రతువు ముగిసింది.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని