AP News: రాష్ట్రంలో జరిగేవి షెకావత్‌కు తెలియవనుకుంటున్నారా?: సోము వీర్రాజు

కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా

Updated : 07 Dec 2021 12:32 IST

విజయవాడ: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టడం విడ్డూరంగా ఉందని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సబబో ఆలోచించాలన్నారు.

‘‘అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన అంశంపై తూతూ మంత్రంగా విచారణ కమిషన్ వేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి. పోలవరానికి నిధులివ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంచనాలు పెంచారని తెదేపా అధినేత చంద్రబాబును విమర్శించిన ముఖ్యమంత్రి జగన్.. అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు? పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం ప్రకారమే నిధులు విడుదలవుతాయి.

స్టీల్‌ ప్లాంట్‌ మూసేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఏపీలోని డెయిరీలు, చక్కెర మిల్లులను మూసేయడాన్ని ఏమనాలి? చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ విస్తృతమైంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు భాజపా మద్దతిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని తక్షణం అమలు చేయాలి. ఉద్యోగులను అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు’’ అని సోము వీర్రాజు ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు