logo

తప్పిన ప్రాణాపాయం

కంకిపాడు సమీప కొణతనపాడు అడ్డరోడ్డు కూడలిలో మంగళవారం సాయంత్రం మరో రహదారి ప్రమాదం జరిగింది. ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వెళుతున్న కారు,

Published : 08 Dec 2021 05:13 IST

కొణతనపాడు అడ్డరోడ్డు కూడలిలో ప్రమాదం


బస్తాలు పడటంతో ధ్వంసమైన కారు

కంకిపాడు, న్యూస్‌టుడే: కంకిపాడు సమీప కొణతనపాడు అడ్డరోడ్డు కూడలిలో మంగళవారం సాయంత్రం మరో రహదారి ప్రమాదం జరిగింది. ముగ్గురు ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వెళుతున్న కారు, అదే దిశలో వస్తున్న ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్‌ ఒకేసారి అడ్డరోడ్డు కూడలికి వచ్చాయి. రహదారి అంచునే ఉన్న గొయ్యిని తప్పించే యత్నంలో చోదకుడు ట్రాక్టర్‌ను కుడివైపునకు మళ్లించాడు. దీంతో అదుపు తప్పిన ట్రాక్టర్‌ పంట కాల్వ అంచున ఉన్న మైలు రాయిని ఢీకొని ఆగింది. ట్రక్కు బోల్తా కొట్టడంతో పక్కనే వస్తున్న కారుపై ధాన్యం బస్తాలు పడ్డాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ కుడి వైపు కూర్చోవడంతో స్వల్ప గాయాలతో బయట పడ్దారు. వాహనం ధ్వంసమైంది. ఉయ్యూరు వైపునకు వచ్చే వాహనాలను కంకిపాడు అంతర వంతెన మీదుగా మళ్లించారు. తాము హైదరాబాద్‌ నుంచి కైకలూరు వెళుతున్నట్లు కారులోని వారు తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి, కమ్మ కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ ప్రమాద స్థలానికి వచ్చి గాయపడినవారిని పరామర్శించారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో పంపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గారావు చెప్పారు.

గొయ్యే కారణం.. ఈ కూడలిలో గత రెండేళ్లలో వందల సంఖ్యలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మరణించారని, అనేకమంది గాయపడ్డారని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. విస్తరణకు ప్రతిపాదించిన స్థలం వివాదం న్యాయస్థానంలో ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నామన్నారు. ఈ ప్రమాదానికి అంచునే ఉన్న గొయ్యి కారణమని స్థానికులు తెలిపారు. ఎన్‌హెచ్‌ సిబ్బంది మాత్రం ట్రాక్టర్‌ అతివేగమే కారణమని చెప్పారు. పోలీసులు మాత్రం దీనిపై స్పందించలేదు. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్‌ సాయంతో తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని